గుణవంతుడి తత్త్వం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచంలోకి మనిషి  ఒంటరిగానే వస్తాడు. తనకు వయసు పెరిగిన తరువాత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని  దానికోసం అనేక  పనులు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కార్మికుడిగా కానీ కర్షకుడిగా కానీ జీవించడానికి సిద్ధమవుతాడు.  తాను సమాజంలో తిరుగుతున్నప్పుడు అనేక మందితో పరిచయాలు ఏర్పడతాయి. అందరూ మంచివారు అనుకునే  మంచివారు ఉన్నారు అందరూ చెడ్డవారు అనుకున్న వారిలో చెడ్డవారు ఉన్నారు.  ఇది వ్యాస మహర్షి భారతంలో  ధర్మరాజును గురించి  దుర్యోధనుని గురించి  చెప్పిన మాట  వారిద్దరి తత్వాలు తెలియడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆడిన నాటకం  దానిలో తెలుస్తుంది చెడ్డవాడు ఎవరు మంచివాడు ఎవరు  ఆ విషయం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది మనిషికి. ధర్మరాజు అందరూ మంచివారే అనుకుని  తనలాగా ధర్మాన్ని తప్పనివాడు  అన్న అభిప్రాయంతో ఎవరికి ఏ ఆపద వచ్చినా  తాను సహాయంగా ఉండి  సహకరించడం  ఆయన నైజం  అదే దుర్యోధనుని దగ్గరకు వచ్చేటప్పుడు  తనలాగే మిగిలిన వారు కూడా చెడ్డ వారే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ నమ్మడానికి వీలు లేదు  కనుక వారు చెప్పే మాటలన్నీ కటికి  అబద్దాలే అని నిర్ణయించుకొని ఎవరికీ సహాయం కాని సహకారం కానీ అందించే స్థితిలో అతను ఉండడు  ఈ రకమైన  ప్రజల మనస్తత్వాన్ని అధ్యయనం చేసిన వేమన  చక్కటి ఉదాహరణతో  మనకు ఆ రెండు మనసుల తత్వాలు తెలియజేయడం కోసం  చక్కటి ఆట వెలది ద్వారా  మనకు తెలిసిన మాటలనే ఉపయోగించి  మనకు అర్థమయ్యే పరిస్థితిలో రాశాడు  ఆయన ఏమంటారంటే. ఎదుటివారికి వచ్చిన కష్టం  చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా  చిన్న సాయం అయితే ఎలాంటి ఇబ్బంది పడకుండానే  ఆ కష్టాన్ని తీర్చేయవచ్చు అదే పెద్దదైతే  పూర్తి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా  తన చేతనైనంత సహాయం చేసినట్లయితే  ఇతను ఏ కొంచెం సహాయం చేసినా  ఆ సహాయం పొందిన వ్యక్తి మంచివాడైతే  గుణవంతుని గుణం ఎలా ఉంటుందంటే  వీరు గోరంత సహాయం చేసినా కొండంత సహాయం చేసినట్టుగా  భావించి వారికి కృతజ్ఞుడిగా ఉండడం  అదే చెడ్డ వారి విషయంలో కొండంత సహాయం చేసినా  గోరంత చేసినట్లుగా కూడా అనుభూతిని చెందకుండా  వారు చేసిన సహాయాన్ని చూపిన సానుభూతిని  మర్చిపోయి కనీసం కృతజ్ఞతా భావం కూడా లేకుండా ప్రవర్తిస్తారు  మంచి చెడుల తారతమ్యాన్ని గురించిన  పోలిక అది వేమన చేసింది ఆ పద్యం చదవండి.

"గుణవంతునకు మేలు తెరంత జెసినా కొండ యవును వాని గుణము చేత  కొండ కొద్ది మేలు గుణహీనుడెరుగునా..."



కామెంట్‌లు