సహజ గుణం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఇవాళ ఏ కుటుంబంలోనైనా  ధనికులైనా బీదలైనా తన పిల్లలకు చదువు చెప్పించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ మొలకెత్తింది  ఇంటిలో ఇబ్బంది పడినా పిల్లల చదువు మాత్రం ఆపకూడదు అన్న నిశ్చయంతో  పిల్లల భవిష్యత్తు కోసం  ఎంతో కష్టపడుతూ ఉంటారు ఆ విద్యార్థి  బడికి వెళ్లి  గురువు గారు చెప్పిన పాఠాలను శ్రద్ధగా చదివి  మంచి మార్కులు తెచ్చుకుని  ప్రతి తరగతిలోనూ ఉత్తమునిగా  ఎన్నిక అవుతూ  అందరి మన్ననలను పొందుతూ ఉంటాడు అయితే వేమన చదువు అంటే ఏమిటి  అక్షరాలను అక్షరాలుగా గుర్తుపెట్టుకుని  పదాలతో వాక్యాలను నిర్మించడమా  ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయిన అంత మాత్రం చేత  చదువులలో ఉన్న మర్మమంతా తెలిసిపోతుందా  దానికి ఎంత శ్రమ పడాలి అంటాడు వేమన. ఎన్నో నీతులు నేర్చుకోవాలని విద్యార్థికి ఉబలాటం  దానికోసం పెద్దవారు ఎక్కడ ఉపన్యాసాలు చెబుతున్నారు వెళ్లి వినడం  వేదాంత చర్చలు  జరుగుతున్నా ప్రాంతానికి వెళ్లి  విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయడం  సామాజిక స్పృహతో  కార్యక్రమాలు చేసే పెద్దవారి  ఉపన్యాసాలను విని  ఎన్నో నీతులను తెలుసుకోవడం  ఈ చదువు కానీ ఈ నీతి గాని  బుద్ధిమంతుడు గనక ప్రయత్నం చేసినట్లయితే  దానికి ప్రయోజనం ఉంటుంది  అలాకాకుండా నీచ గుణం కలిగినటువంటి వ్యక్తి విద్యార్థిగా  ఎవరు ఎన్ని నీతులు చెప్పినా  ఎన్ని గొప్ప గొప్ప పుస్తకాలు చదివిన  వస్తుతః  తనకు ఉన్న నీచ బుద్ధిని మార్చుకోవడానికి అవకాశం ఉన్నదా  ఎన్నైతేనే అనుసరిస్తున్నాడా  అని ప్రశ్నిస్తున్నాడు వేమన.
ప్రశ్నించడమే కాదు దానికి సమాధానం కూడా చెప్తున్నాడు  బుద్ధిహీనుడు ఎంత చదువు చదివినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఎంతమంది బుద్ధిమంతులతో స్నేహం చేసినా అతని జీవితంలో అతని బుద్ధి మారడం అంటూ జరగదు అని స్పష్టం చేస్తున్నాడు దానికి ఉదాహరణ కూడా ఇస్తూ  బొగ్గుని తీసుకొని  దాని నలుపును పోగొట్టడం కోసం  మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ నలుపు పోతుందా  చివరకు శుద్ధమైన పాలను తీసుకువచ్చి  ఆ పాలతో కడిగినా ఆ బొగ్గుకు ఉన్నటువంటి సహజమైన నల్లటి  రంగు పోవడానికి అవకాశం ఉన్నదా  అని ప్రశ్నించి  ప్రపంచంలో జరగని పని అది ఒక్కటే అన్న సమాధానం కూడా ఇస్తున్నాడు  ఎంత పరిశీలనాత్మక  దృష్టితో చెప్పిన విషయం అది  వారు చెప్పిన పద్యం ఒక్కసారి చదవండి.

"ఎంత చదువు చదివి నెన్ని నీతులు విన్న హీనుడవగుణంబు మారలేడు బొగ్గు పాలగడుగ బోవునా మలినంభూ..."  

కామెంట్‌లు