దానశీలి బుడ్డా వెంగళ రెడ్డి- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సహజంగా ఎవరికైనా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారి గురించి  చదవాలని తెలుసుకోవాలని ఉంటుంది  కానీ కొంతమంది పరిశోధన చేసి వారు చేసిన మంచి పనులను సమాజానికి తెలియజేయాలన్న  సత్సంకల్పంతో  ఆ చరిత్రను  మంచి రచయితతో  రాయించి తాను  ఆ గ్రంథాన్ని ప్రచురించి  సమాజానికి అందించి  ఎంతో సంతృప్తిని పొందుతారు  అలాంటి వారిలో ప్రథమంగా చెప్పుకో తగింది గౌరవనీయులు  సాహిత్య అభిమాని  దానశీలి  మాకు ఆత్మీయులు శ్రీయుత కొండా లక్ష్మీకాంత రెడ్డి గారు. వారు ఎంతో కష్టపడి ఈ గ్రంథాన్ని  మనకు అందించారు వారికి అభినందనలు తెలియజేస్తూ  కృతజ్ఞతలతో బుడ్డా వెంగళ రెడ్డి గారి చరిత్ర  మీకు అందజేస్తున్నాను  చదివిన తర్వాత కొంతమంది అయినా వారి దయ  దానశీలతను  అనుసరించితే ఎంతో ఆనందించే వారిలో నేను ప్రధముణ్ణి. తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చిన ఏ బిడ్డ అయినా అరిషడ్వర్గాలకు దూరంగా వస్తుంది  తాను పెరుగుతున్న కొలది తాను పరిసర ప్రభావాల వల్ల  తనకు ఎదురైన సంఘటనల వల్ల  మానసిక మార్పులు జరుగుతూ ఉంటాయి  కొంతమందికి జరిగిన ఘోరమైన అన్యాయాల ఫలితంగా సమాజం మీద కోపం పగ కసి పెరుగుతాయి  దానితో ఎన్నో అనర్ధాలు చేయడానికి పూనుకుంటారు. మరి కొంతమంది వారికి జరిగిన మంచి  వారి మంచితనం వల్ల వారికి ఏర్పడ్డ సన్నిహిత మిత్రులు  సమాజంలో ఉన్న సముచిత స్థానం  వారిని ఉన్నత స్థానంలోకి చేరుస్తుంది  ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిరుచిని పెంపొందించుకుంటారు  తాను సంపాదించిన ప్రతి రూపాయి తనికే దక్కాలి అన్న స్వార్థంతో కొంతమంది  మనం సంపాదిస్తున్న దీనిలో కొంతైనా సమాజానికి ఉపయోగిస్తే బాగుంటుందని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు.
కార్యాలు తన వద్దకు వచ్చి ఏది కావాలంటే అది చేయడానికి ఇవ్వడానికి సంసిద్ధమైన ఏకైక వ్యక్తి  కర్ణుడు  దానశీలిగా ప్రఖ్యాతిగాంచినవాడు  బలి చక్రవర్తి ఒక పక్షి కోసం తన శరీరంలో బాగాన్ని కోసి ఇచ్చిన  త్యాగమూర్తి  ఇలాంటి మహానుభావుల  జన్మలతో తరించినది ఈ భారతదేశం.ఈ దేశంలో ఏ మనిషి పుట్టుకతో స్వర్ధపరుడు కాడు ఏదో రకంగా సమాజానికి సేవ చేయాలి  అన్న ఆలోచనతో పెరుగుతున్న వాడే  తోటి వారు ఆకలితో మల మల మాడుతుంటే చూసి ఏ అమ్మ ఓర్వలేదు. తనకు లేకపోయినా ఒక ముద్ద తీసుకొచ్చి అతని కడుపు నింపుతుంది. మాతృమూర్తి మమకారాన్ని కొలవడానికి  ఈ ప్రపంచంలో పరికరాలే లేవు  జన్మతః వచ్చిన ఆ మాతృతత్వం  అందరి పైన ప్రసరింప చేస్తుంది  అదే అమ్మతనం.
కామెంట్‌లు