తెలంగాణ ముక్తకాలు ;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871.
1.
ఎగిరిందిక్కడే 
అస్తిత్వపు జండా గరిమనాభి  
స్థిర లయలో పాడింది గుండె గొంతుకై 

2. 
కార్య క్షేత్రమైంది కరీంనగర్
తెలంగాణ ధర్నా చౌక్ వేదికగా
గెలిచి నిలిచింది నా మట్టి మాట

3.
తొలగినవి ముసుగుల మబ్బులు
నడుం బిగించే స్వరాష్ట్ర కోరిక
వీరుల నేలలో నా గడ్డ రెక్కలు

4.
ఉద్యమాల కెరటాలు కదిలినవి
మిలియన్ మార్చ్ జన కడలి
ఆట పాటే మన ఊరూ వాడైంది 

5.
మనిషి మనిషి కదిలే భుజం భుజం కలిసి 
సాగర హారం కలలన్నీ 
సాధించింది నా కొత్త బాట 


కామెంట్‌లు