శ్రీమాత! పరదేవత!; - శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷శ్రీమాత! పరదేవత!
శివ కామేశ్వరి! గౌరి!
      జయ శివాని! జనని!
జగదాంబ! లలితాoబ!(1)
🪷అమ్మవు నీవె! భవాని!
అఖిల జగమ్ములకు!
      అమ్మల గన్న యమ్మవు!
జగదాంబ! లలితాoబ! (2)
        ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
🪷శ్రీమాతయే లలితాంబ!సకల భోగభాగ్యాలు అనుగ్రహించు పరమేశ్వరి!  శ్రీo"కార స్వరూపిణి! "హ్రీం"కారేశ్వరి.. జగదాంబిక! ఇష్ట కామ్యములు నెరవేర్చు.. మహా కామేశ్వరుడైన, పరమ శివునిరాణి!
       "శ్రీమాతా! శ్రీ మహా రాఙ్ని!" అని, మంగళాచరణం కావించారు; "శ్రీ లలితా సహస్ర రహస్య నామ స్తోత్రము" నందు, వశిన్యాది వాగ్దేవతలు!
 🔆శ్రీమహా రాజ్ని.. సర్వలక్షణ సంపన్నయైనది! సౌభాగ్యలక్ష్మీ స్వరూపమైనది! సర్వ సంపత్తులను ప్రసాదించునది! కనుక "శ్రీమాత" అని, ప్రార్ధింపబడు చున్నది! అఖండ ఆనందైకరసానుభవ యోగ్యమయినది! పరoబ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించునది! కనుక "శ్రీమాత” నామము సార్థకమైనది!
🪷శ్రీలలిత.. స్థూల, సూక్ష్మాదులకు అతీతురాలగు జనని! కామశ్వరుని వామాంకము నధిష్ఠించి యుండునది! కనుక, "శివ కామేశ్వరాంకస్థా" అని పేరు! "శివా" అనగా.. శుభములు, మంగళములు, విజయములు.. మున్నగు వాటిని, ఆరాధకులకు, మరియు సాధకులకు అనుగ్రహించునది! అట్లే, అగ్నియందు ఉష్ణశక్తివలె; పరాశక్తి.. పరమశివుని యందు అభిన్నమైనది! కనుక, "శివా", "శివాని" అని, శ్రీమాతను ప్రస్తుతించారు! మనమహర్షులు!
   "శివ కామేశ్వరాంకస్థా!
   శివా! స్వాధీన వల్లభా!"
అని, శ్రీలలితా సహస్ర రహస్య నామ స్తోత్రం..52.. 53.. నామావళి!
     🚩 మధురాక్కర పద్యము
      "శ్రీం"పదయుత బీజత్రయీ! శృంగారయోన్య సుథా!   
      చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా!    
      రంపిలు గలిదోషావకర క్రియా దుష్పంకపు 
       రొంపి దిగఁబడనీయక ప్రోవవే! శ్రీలలితా! (1)
        "హ్రీం"సమాయుక్త! కామేశ ప్రియభామ! త్వచ్చరణ
       పాంసుకణ ధారణాసక్త వాసవాది నతశిర
      శ్శంసితముకుట ఖచిత ప్రస్తర సువిస్తారిత ద్యు
      త్యంశురాజిత పద్మపాదా! నమ శ్రీలలితా! (2)
            ( శ్రీలలితా మధురాక్కరలు., కవితాప్రసాద్., )

కామెంట్‌లు