గంగామాత దివ్యమంగళ స్వరూపముశంకర ప్రియ., శీల.,సంచార వాణి: 99127 67098
  🪷 బాలచంద్ర మౌళి! గంగ!
 శ్వేతనాగ భూష! గంగ!
      శరశ్చంద్ర వర్ణ! గంగ!
 నమస్సులు శివగంగ! (1)
 🪷వరాzభయ ప్రద! గంగ!
 సుధాధారాకార! గంగ!
     మకరవాహన!  గంగ!
 నమస్సులు శివగంగ! (2)
          ( అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ., )
👌గంగాభవాని.. భగీరథుడను మహారాజు తపోనిష్టచే.. భూమండలమునకు విచ్చేసింది. కనుక, "భాగీరథి" యైనది! జహ్ను మహాముని యొక్క చెవియందు పుట్టింది. కనుక, "జాహ్నవి"అని, పేరు వచ్చింది!
 👌గంగమ్మ.. తలపైన చల్లని చంద్ర కళను, మెడలోన తెల్లని నాగుపామును కలిగియున్నది! అట్లే, శరత్కాలపు చంద్రునివలె ప్రకాశిస్తున్న కిరీటమును ధరించినది!  నాలుగు చేతులలో.. అమృత భాండము, పద్మము, వరద, అభయద.. ముద్రలను దాల్చినది! అమృత ప్రవాహము జాలువారు తున్నట్లున్న వస్త్రాభరణాలతో, మకర వాహనముతో శోభిల్లు చున్నది! అటువంటి  గంగాభవానిని సేవించే వారికి శుభములే కలుగుతాయి! కాని, భక్త మహాశయులకు అశుభములు, మరియు అవమానాలు.. కలుగనేరవు! అని, గంగామాత యొక్క సాకార స్వరూపమును.. "గంగాలహరి" స్తోత్రము నందు అభివర్ణించారు, జగన్నాథ పండిత రాయలు
      🚩ధ్యాన శ్లోకము
    శరచ్చంద్రశ్వేతాం శశిశకల శ్వేతాల మకుటాం
     కరైః కుంభాంభోజే వరభయ నిరాసౌ చ దధతీం!
     సుధా ధారాకారాభరణ వసనాం శుభ్రమకర
    స్థితాం త్వాం యే ధ్యాయం త్యుదయతి నతేషాం పరిభవః!!
      జయజయ జనని! పావని!
      జయజయ గంగా భవాని!
       🚩ఉత్పలమాల పద్యము
     బాలశశాంక శేఖరము, పాండుదుకూల వసానమున్, శర  
       త్కాలసుధామరీచి సుభగంబును, వాసుకి కంకణంబునై 
       నాలుగు చేతులన్ నిధులు నాలుగు తొలిచి నక్రపీఠిపైఁ 
       గ్రాలెడి మంగళాకృతిని గన్నుల నిల్పి భజింతు జాహ్నవిన్!
             ( గంగాలహరి., తెలుగు సేత: "మధురకవి" పింగళి లక్ష్మీకాంతం కవి.,)

కామెంట్‌లు