ఆర్భాటాలు అవసరమా?;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి).విశాఖపట్నం9963265762
అన్నార్తుల ఆకలికేకలు
అనాథుల ఎండిన డొక్కలు
అరపూటకి ఒక పిడికెడు మెతుకుల కొరకై
అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుని
ఆరని ఆకలిమంటలతో
అల్లల్లాడుతున్న ప్రజలు

అన్నమో రామచంద్ర అని
ఆస్థిపంజరములాంటి 
అనేక మంది ఆక్రోశాల మధ్య
ఆర్భాటంగా నేడు జరుగుతున్న  పుట్టిన రోజులని,పెళ్ళిళ్ళని రాజకీయ కార్యక్రమాలని
నేటి సమాజాన నిర్వహించే
వేడుకలు, భోజనతంతు చూస్తుంటే
నిజంగా మనం మానవత్వమున్న మనుషులమేనా యని 
రంతిదేవుడు, తథాగతుని వారసులమా
వినోభాభావే, కాళోజి   చెప్పిన మాటలు ఆచరిస్తున్నామా
సనాతనధర్మానికి ప్రతీకయే భారతదేశమన్నది  ఎంతవరకు వసుదైకానికి ఆదర్శం
ఒక్కసారి ఆలోచించండి
ఆర్భాటాలవసరమా?,

( నేడు జరిగే అనేక కార్యాలలో జరుగుతున్న ఆర్భాటాలు చూసిన నా హృదయవేదన అక్షర రూపంలో)
.............................


............................

కామెంట్‌లు