మాటలమూటలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మాటలు
మూటకడతా
మదిన
దాచుకుంటా

మల్లెలు
మాటలతో కలిపేస్తా
సుగంధాలు
చుట్టూ చల్లేస్తా

మాటలు
మిలమిలమెరిపిస్తా
తెలుగును
తళతళవెలిగిస్తా

మధువును
మాటలకు పూస్తా
పలుకులను
బహుపసందు చేస్తా

మాటలు
విసురుతా
మనసులు
దోచుకుంటా

మాటలను
నీళ్ళలో ముంచుతా
గొంతులను
తడుపుకోమంటా

మాటలను
వండివడ్డిస్తా
కడుపులను
నింపుకోమంటా

మాటలు
మండిస్తా
వైరులను
తగలేస్తా

మాటలు
పొంగిస్తా
మాధుర్యాలు
పంచేస్తా

మాటలు
చల్లేస్తా
మేనులు
తడిపేస్తా

మాటలు
పేరుస్తా
కవితలు
వల్లెవేస్తా


కామెంట్‌లు