రస సృష్టి - ఆరోగ్య పుష్టి !;- కోరాడ నరసింహా రావు !
నవరస భావ విన్యాసమే నాట్యము... !
సాహిత్య, జoత్ర వాద్య సంగీత గాత్ర, హావభావ అభినయ సమ్మి స్రిత సమగ్ర స్వరూపమీ 
 నాట్యము... !!
    ఆంగికాహార్యవాచికాభినయ 
రస సృష్టి... ఈ నాట్యమును వీక్షించి, ఆస్వాదించి అనుభూ  తించని జన్మము జన్మమే... 
 మరణ సదృశము గాక...... !!
       
  ఆదిదంపతులను ...తలపించే 
   అతివ ఆనందతాండవం !
పరవశించదా...ఈ ప్రపంచం...!
 జంత్రవాద్య విన్యాసం.... !
  తదనుగున పద నర్తనం !!

సాహిత్యం....  సంగీతం... !
  వీటితో కూడిన నాట్యం...., 
 ముప్పేటల పెనవేసుకుని... ముచ్చటగొలిపెను...!

మోకాళ్ల వరకుపాకి. నల్లత్రాచువలె నాట్యముచేసే   ముదిత వేణి వలె.... మోహమును పెంచెను  !!

లలిత కళ లకు పులకించని 
 హృదయము... హృదయమే 
   అది కఠిన పాషాణము గాక!
ఈ కళా నైపుణిని గాంచినంతనే హృది రోగములన్నీ మాయమౌను కద...!ఆ ఆనందమున 
చక్కని ఆరోగ్యమే... 
చేకూరును కద!!
       *******


కామెంట్‌లు