తిరుపతి,
నేటి సాంకేతిక యుగంలో బాలల సమగ్ర వికాసానికి సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్" అవార్డు గ్రహీత, ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి కోరారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విద్యతో పాటు సాహిత్యం, కళలు, క్రీడారంగాల్లో కూడా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. తిరుపతి బ్లిస్ హోటల్ లో శుక్రవారం మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తో జరిగిన ఆత్మీయ భేటీలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా శాలువా, జ్ఞాపికతో మండలిని ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో
ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ దాసరి కిరణ్ క్రాంత్ చౌదరి, శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన చర్చలో నల్లాని రాజేశ్వరి పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.
పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చన్నారు. నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారన్నారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయన్నారు. మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర, పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు కనిపిస్తాయన్నారు. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలని వివరించారు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నదన్నారు. బాలసాహిత్యం పురోగతి సాధించిందని, గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నదని చెప్పారు. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా రాశారని, కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారని చెప్పారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయన్నారు. ఆధునికంగా మర్యాదరామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయన్నారు.
దేశ భవిష్యత్తు బలంగా తయారుకావడానికి బాలల నైపుణ్యాల వృద్ధిపైనే ఆధారపడి వుంటుందన్నారు. జీవన నైపుణ్యాలపై అవగాహన ద్వారా బాల్య దశ నుండే జీవిత విలువను గుర్తింపచేయవచ్చన్నారు. మానసిక వికాసం, విద్యా వికాసం, నైతిక విలువలను పెంపొందించే దిశలో కృషిచేయాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణకు, బాలల మెరుగైన భవిష్యత్తుకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటుపడాలని నల్లాని రాజేశ్వరి కోరారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి