ప్రతిభామూర్తులు.;-తాటి కోల పద్మావతి

 తెనాలి రామకృష్ణుడు.
(16వ శతాబ్దపు పూర్వార్ధం)
ఈయన స్వగ్రామం తెనాలి. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామ పండితుడు. ఇంటిపేరు గార్లపాటి వారు. వీరు తెనాలిలో నివసించడం వల్ల ఇంటిపేరు తెనాలిగా రామకృష్ణుడు అయ్యాడు. శ్రీకృష్ణదేవరాయలు 15 15 లో కొండవీడు దుర్గాన్ని ఆక్రమించాడు. తిమ్మరుసు తన అల్లుడైన గోప మంత్రిని ఆ దుర్గానికి అధిపతిని చేశాడు. గోప మంత్రి తన రాచరికపు పనులు నిర్వహించే ఊర దేచయ్య మంత్రికి ఒక అగ్రహారం దానం చేశాడు. ఈయన రామలింగ కవికి ఆశ్రమించాడు. దేచయ్య శివ భక్తుడు. శివ భక్తులలో గొప్పవాడు ఆయన చరిత్ర కావ్యంగా వ్రాయమని తెనాలి రామలింగని కోరగా'పెద్దనారాధ్య చరిత్ర', కావ్యంగా మలచాడు. ఆ తర్వాత రాయల ఆస్థాన ప్రాప్తి లభించగా అక్కడ వైష్ణవమే పై చేయి కావడం వల్ల రామకృష్ణుడిగా పేరు మార్పు చెందింది. ఇతడు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో? కాదా! అనే వివాదం ఉంది. ఒకవేళ ఇతడు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన చివరాంకములో చేరి ఉండవచ్చు. రాయల ఆస్థానంలో మాత్రం ఆయన ఐదు సంవత్సరాలకు మించి లేడు. ఆ కాలంలో ఇతర కవులను అవహేళన చేయుట, కొంటె పద్యాలతో ప్రసిద్ధుడయ్యాడు. రాయలవారి మరణానంతరం సంగరాజు వద్దా వ్రాయస వృత్తిలో ఉన్న విరూరి వేదాద్రిని ఆశ్రయించాడు. అక్కడే అతడి ప్రసిద్ధ కావ్యం పాండురంగ మహత్యం వెలువడింది. దానిని వేదాద్రి కి అంకితం ఇచ్చాడు.

కామెంట్‌లు