సుప్రభాత కవిత ; - బృంద
బ్రతుకు దారి
సుగమమేం కాదు 
అందరికీ!

పచ్చగానే ..వుండదు
చుట్టూ.....
ఎండకాస్తుంటే నీడ కూడా
వుండదు..
దాహమేస్తే నీరు దొరకదు
ఒకోసారి...

ముళ్ళూ రాళ్ళూ 
గుచ్చుకుంటాయని
భయపడితే
గమనం సాగదు ..
గమ్యం 
దొరకదు..
దారి చేసుకుని..
జాగర్తగ నడవాలి.

బోలెడు సర్దుబాట్లూ
కాసిన్ని సమ్మెటపోట్లూ
తప్పవు...

ఒంటరి కాదు మనం
మనతో మన కలలుంటాయి.
ఉత్సాహం ..ఆరాటం
అడుగులు అవుతాయి

మనకు మనమే సైన్యం
జీవన పోరాటంలో
సంకల్పం సహనం
ఆయుధాలు...
తృప్తీ...సంతోషాలు 
విజయ ఫలాలు

మనసు కిటికీ తెరచి
మానవత్వపు వెలుగులు
చూడాలి.

ఏదొస్తే అది నాదనుకుంటే
నీదనుకున్నది నీదరికి
తానే వస్తుంది.

మౌనాన్ని మధించి
అనుభూతుల అమృతం
సాధించాలి.

మన ఆలోచనే 
మనని నడిపేది
మనకు లభించేది.

కపటం ఎరుగని 
కిరణంలా....
వెరపును విరిచే
వెలుగులు తెచ్చే 
ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు