బుద్ధం శరణం గచ్ఛామి... !...కోరాడ నరసింహా రావు.
సుఖభోగాల రాచబిడ్డగా పుట్టినవాడితడు.... !
  రాజు శుద్దోధనుని కన్న కుమారుడు సిద్దార్ధుడు ఇతడే!

మానవజీవనవాస్తవికతను... 
  కన్నులారగాంచి..., 
 ఈ రోగబాధలు, జరామరణములు సుఖదుఃఖాల ఆటుపోట్లకు మూలమేమియో తెలిసికొనగ రాజ్యాధికార సుఖ, భోగములను... ఆలు, బిడ్డనూ అర్ధరాత్రి విడచి...
    సత్యా న్వేషియై... శుద్దోధనతనయుడు సిద్దార్ధుడు బయలుదేరినాడు... !

బోధివృక్షమున అంతర్ముఖుడై 
ధ్యానమునె  చేయగా..... , జ్ఞానముపొంది..., 
ఆ జ్ఞానామృతమును,
లోకమునకు పంచగ....
బద్దుడుతానైబయలుదేరినాడు

కష్టములకు మూలము కోరిక లేయని...,
అహింసయే... పరమధర్మమని, వివేకబుద్ధియెగొప్పదని.,బుద్ధం శరణంగచ్ఛామియనచు...  

సాంఘిక జీవ నముననే... సౌఖ్యము కలదని... 
సంఘంశరణం...
గచ్ఛామియనుచు...,  ప్రచారమున దేశాటన చేయగ l
గౌతమబుద్ధుడుతానుగ..తాను 
ప్రవచించిన దదియె, బౌద్దమతముగా.... ప్రపంచమునప్రచారమయ్యెను!  ఎందరెందరినో ఆకర్షించి.... వాసికెక్కెనవి ...   బుద్ధుని ప్రవచనములు, అవియే బౌద్ధ మతముగా వాసి కెక్కినవి ! !
 జననము, నిర్యాణములే కాదు జ్ఞానము పొంది నదియూ పౌర్ణమియే.... 
    జ్ఞాన పిపాసులు భక్తి శ్రద్దలతో... ఆ రాధింతురు ఈ పౌర్ణమినే... బుద్ధ పూర్ణిమగా !
      ********

కామెంట్‌లు