చిన్నారుల వెతలు(మణిపూసలు);- పి. చైతన్య భారతి,
సెలవులని చేస్తున్నరా?
అమ్మనాన్నలకాసరా?
రోళ్ళు పగులు నెండల్లో..
రాళ్ళను మోస్తున్నారా?

బతుకు మేడ నిర్మించగ 
ఇటుకలే సాక్ష్యమ్ముగ 
అరికాళ్ళే బొబ్బలెక్కె
కొలిమి ఎండ మండంగ!

కంప్యూటరు ఆటలందు 
ఏ.సి చల్లని గదులందు 
అదృష్టపు తమ్ముళ్లూ 
దైవ వివక్ష మాయందు!

ముప్పూటల భోజనమే 
దొరికేది ఓ గగనమే 
విలాసాలు మాకేలా?
కష్టాలతో పులగమే!

చిట్టితండ్రి ప్రాణాలకు 
బొబ్బలెక్కె పాదాలకు 
కందిపోయి చేతులన్ని 
కాయకాసెను బాలలకు!
 
చిన్నప్పుడె దేన్నైనను 
తట్టుకొని నిలబడాలను 
పరీక్షలెన్నో పెట్టీ..
పాఠాలనే  నేర్పినది!


కామెంట్‌లు