మరుగున పడిన మహనీయులు ;-అచ్యుతుని రాజ్యశ్రీ

 శ్రీ పాండురంగశాస్త్రి అథవాలే1920లో రాయఘడ్ లో పుట్టారు. తండ్రి శ్రీ వైద్యనాధశాస్త్రి 1926లో బొంబాయి లో శ్రీమద్భగవద్గీతాపాఠశాలను నెలకొల్పారు. స్వాధ్యాయ పరివార్ కి శ్రీకారం చుట్టారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలరక్షణ జాతీయ భావం పెంపొందించాలి  అనే ఆశయంతో  ఊరూరా తిరిగి యువతలో చైతన్యం తెచ్చారు. 1954లో బాలసంస్కార కేంద్రాలు నెలకొల్పారు. రామాయణ భారత ఉపనిషత్తులతో పాటు వీరగాథలు బోధిస్తారు ఈకేంద్రాలలో!1954లోపాండురంగశాస్త్రిగారు
జపాన్ లో విశ్వధర్మపరిషత్తులో పాల్గొని1956లో 11ఎకరాల్లో తత్వ జ్ఞాన విద్యాపీఠాన్ని నెలకొల్పారు.రాజకోట్ లో1979లో తొలి వృక్ష మందిరాన్ని నెలకొల్పారు. అక్కడ మొక్కలని శ్రద్ధగా పూజపునస్కారాలతో పెంచి పెద్ద చేయడం లో అంతరార్ధం  పచ్చదనం పరిశుభ్రత మనిషిజీవితంలో అంతర్భాగం అని చాటడమే! రైతులు బెస్తల కోసం సంస్థలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులని ప్రోత్సహించారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక రోగులకి వైద్యం చేసేందుకు ఎన్నో సంస్థలు స్థాపించారు. నేడు  మన దేశంలో ప్రభుత్వాలు అనుసరించే మార్గం అథవాలే గారు చూపిన చక్కని రాజమార్గం! డాక్టర్ బానూ జహంగీర్ కొయజీ22ఆగస్టు 1918లో బొంబాయి లో జన్మించారు. ఈమె తండ్రి ఇంజనీర్.ఈమె అమ్మమ్మ గారి ఇంట్లో పూనేలో పెరిగి ఫ్రెంచ్ నేర్చారు.2ఏళ్ల ప్రీమెడికల్ ట్రైనింగ్ తర్వాత  గ్రాంట్ మెడికల్ కాలేజ్ లో  ఎం.డి.డిగ్రీ పొంది  గైనకాలజీలో స్పెషలైజేషన్ చేసిన బానూ భర్త ఇంజనీర్!1944లో మహాత్మా కార్వే స్ఫూర్తి తో పూనె లో తొలి కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారామె. మారుమూల ప్రాంతాల్లో  క్లినిక్కులు  నడుపుతూ  పౌష్టికాహారంని గ్రామాల్లో పంపిణీ చేసేవారు. 1980లో ఈమె కృషి వల్ల శిశుమరణాలసంఖ్య తగ్గింది. 1988లో ఆరోగ్యం స్త్రీవిద్య వృత్తిశిక్షణ పై దృష్టి కేంద్రీకరించారు డాక్టర్ బానూ. స్త్రీ చైతన్యంపైనే కుటుంబ గ్రామ పురోగతి ఆధారపడి ఉన్నాయి అనేది ఆమె తెలియజెప్పేవారు.కె.జి.యం.ఆసుపత్రి డైరెక్టర్ గా  అంతర్జాతీయ ఖ్యాతి తో పాటు 1993లో రామన్ మెగసెసె అవార్డు అందుకున్న డాక్టర్ బానూ కొయజీ ఆదర్శ నారి!🌺
కామెంట్‌లు