వనజ శతకము(అట వెలదులు )ఎం. వి. ఉమాదేవి

 1)
నమ్మకమ్ము నిలుచు నయమెల్లవేళలన్
నటన జేయరాదు నరులముందు
నాత్మ నిండుకుండ యపనమ్మకమదేల
వనజ మాట మిగుల వాస్తవమ్ము!
2)
ఒకరి సంతసముకు నొసగిన సాయమ్ము
మనసులోన నిలుచు మానవతగ
పరుల కంటనీరె పాపమౌ శాపమౌ
వనజ మాట మిగుల వాస్తవమ్ము!!
కామెంట్‌లు