వంటిల్లే కాదురా!; - కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
వంటిల్లే....  కాదురా స్త్రీ యొక్క స్తానం... !
 కన్నుతెరిచి చూడరా ఆ విశ్వ రూపం... ! ఆ విశ్వ రూపం !!
అను పల్లవి ;-
    మగవారిని మించిన  స్థయిర్యం... అన్ని రంగాలలో పట్టుదలతొ సాధించిన విజయం... సాధించిన విజయం 
  .. " వ0టిల్లే కాదురా...... !
చరణం :-
   వీడక నిరతమూ  ప్రక్కనే ఇడుకునె,సరస్వతిని ఆబ్రహ్మ.!
    పతి పాదములు కాదు,సతి స్థానమని...తనహృదయములో నిలుపుకుని..,ఆ  లక్ష్మిని అమితముగా ప్రేమించెను   
   శ్రీ  మహావిష్ణువు !
సతి యన్న, పతిలో  సగ భాగమని...పార్వతికి  తన దేహములో సగ భాగమిచ్చి అర్ధ నారీసుడే అయ్యెను... ఆ  పరమ శివుడు !
       " వ0టిల్లే   కాదురా..... "
చరణం :-
    ఆడదంటే ఆబలకాదు...ఆది ఆదిశక్తియని తెలుసుకో..... నిష్కల్మషముగ తనను  ప్రేమించి....  ఆమె హృదయేశ్వ రునిగా... నీవు  నిలిచిపో... !
  ఆమె హృదయేశ్వరునిగా....
నీవు  నిలిచిపో.... !!
        ********

కామెంట్‌లు