నదీ స్నానం.;- తాటి కోల పద్మావతి
 

గంగాది పుణ్య నదీ తీర్థంలో మహర్షులు, చక్రవర్తులు ఎన్నో యజ్ఞాలు చేసి, యజ్ఞ శేష పదార్థాలైన బూడిద మున్నగు వాటిని ఆ నది జలాల్లో కలిపారు. ఎందరో తపస్సులు చేసి, తపశక్తిని అర్గ్య ప్రధాన రూపంలో ఆయా నదీ జలాల్లో సమర్పించారు. కనుక తరచుగా నదీ నద జల (తూర్పున పుట్టి-పడమరగా ప్రవహించేవి నదాలు. పడమట పుట్టి-తూర్పుగా ప్రవహించేవి నదులు) స్నానం, పానం వల్ల ఎంతో పుణ్యం, ఆరోగ్యం లభిస్తుంది. పుణ్య నదుల పేర్లు స్మరిస్తూ-ఇంట్లో ఉండే నీళ్లతో స్నానం చేసినా, నదీ స్నానఫలం దక్కుతుందని పెద్దలు నిర్వచించారు.
నీటికి, మనిషికి అవినాభావ సంబంధం ఉంది. మన శరీరం ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మొదలైన లోహాలూ, ఆమ్లాలు, క్షారాలతో నిండిన ఒక టెస్ట్ ట్యూబ్. మన ఆలోచనలు కూడా రసాయనిక అణువుల ప్రవాహమే! కొన్ని ఆలోచనలు మన దేహపు గ్రంథంలో కొన్నింటిని ఉత్తేజపరచి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తాయి. మనలోని జీవ రసాయనాల స్థాయిని ఎప్పటికప్పుడు సమతూకంలో ఉంచుకోవడానికి స్నాన ప్రక్రియ ఎంతో తోడ్పడుతుంది.

కామెంట్‌లు