మార్కులూ డబ్బులూ;- - జయా
 స్కూల్లో చరిత్ర పాఠాలు చెప్తున్నప్పుడు వాటిలో వచ్చే ఊళ్ళూ పేర్లూ సంవత్సరాలూ 
చిక్కుముడిలా తోచేవి. ఆ పాఠాలు వినడానికీ చదవడానికీ మూలిగేవి చెవులూ కళ్ళూ నోరూ. 
కానీ ఇప్పుడు చరిత్ర పుటలు తిరగేయాల్సి వస్తోంది దాదాపుగా ప్రతి రోజూ. 
ఓ పత్రిక కోసం స్వాతంత్ర్య సమరయోధుల గురించి రాసే అవకాశమొచ్చి పేర్లూ ఊళ్ళూ తేదీలూ శ్వాసిస్తున్నా. 
అప్పట్లో
మార్కులకోసం బట్టీ పట్టి చదివాను. ఎంత బట్టీపట్టి రాసినా కనీస మార్కులతోనే గట్టెక్కే వాడిని. పరీక్ష హాల్లోకి వెళ్ళడంతోనే ఏవీ గుర్తుండేవి కావు. ఎట్టాగో ఫెయిల్ అవకుండా నెట్టుకొచ్చేసాను. ఇప్పుడేమో డబ్బుల కోసం చరిత్ర పుటలు తిరగేస్తున్నాను. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే ఒకింత మనసు పెట్టి చదువుతున్నాను చరిత్రలోని ఘటనలను. రాయాలిగా పొరపాట్లు లేకుండా....అందుకోసం ఒకటికి రెండుసార్లు చదువుతున్నా రాసింది ఆ పత్రికకు పంపేముందర.

కామెంట్‌లు