శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 భారతంలో పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఈపదానికి అర్థం మనిషి కి ప్రేరణ ఇచ్చేవాడు అని. నాగయజ్ఞంలో పాల్గొన్న ఒకపురోహితునిపేరు జనమేజయుడు. 
జాబాలిపురం అనే శబ్దం నించి జబల్పుర్ అనే పేరు వచ్చింది. జాబాలి ఋషి ఆశ్రమం ఇక్కడ ఉండేదిట! ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. దేవతాల్ చౌసఠ్ జోగినీ  అనే పుణ్య ప్రదేశాలున్నాయి. బైజనత్థా ప్రసిద్ధ తాంత్రిక ఆలయం.మధ్య ప్రదేశ్ లోని ముఖ్య నగరం! నర్మదా నది ఒడ్డున ఉంది. 
జరాసంధుడు బృహద్రథుని కొడుకు. అతను మగధదేశరాజు.ఇతని రాజధాని  రాజగిరి(గిరివ్రజ్).భీముని చేతిలో చంపబడ్డాడు జరాసంధుడు 🌺

కామెంట్‌లు