కవితాజల్లులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవనకిరణాలను
ప్రసరిస్తా
దట్టమైనమేఘాలను
గుమికూర్చుతా

కవితావెన్నెలను
కాయిస్తా
చక్కనితలపులను
పుట్టిస్తా

అక్షరాలు
కురిపిస్తా
కవితలను
పారిస్తా

నోర్లను
తెరిపిస్తా
కైతాసుధను
త్రాగిస్తా

రాగాలు
తీయిస్తా
నాట్యమును
చేయిస్తా

చిరునవ్వులు
చిందిస్తా
మోములను 
వెలిగిస్తా

అందాలను
చూపిస్తా
ఆనందాలను
పంచేస్తా

నవరసాలు
జూర్రుకోమంటా
నవరత్నాలు
ఏరుకోమంటా

కవనసేద్యము
చేబడతా
సాహిత్యమును
పండిస్తా

తేనెచుక్కలు
చల్లిస్తా
తీపిపలుకులు
విసిరిస్తా

ముచ్చట్లు
చెప్పిస్తా
మనసులను
మురిపిస్తా

తనువులను
తాకుతా
మదులను
ముట్టుతా

కవనములో
తడవండి
కవిత్వములో
మునుగండి


కామెంట్‌లు