*హనుమాన్ చాలీసా*
 శ్రీ శోభకృత, వైశాఖ బహుళ దశమీ, ఆదివారం - 14.05.2023,  హనుమజ్జయంతి శుభాకాంక్షలతో*
*ప్రతీ హైందువుని నమ్మకం - హనుమాన్ చాలీసా*
*ప్రతీ హిందువు బలం - హనుమాన్ చాలీసా*
*మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశం మొత్తంలో ఉన్న ప్రతి హిందువూ, ఏదో ఒక సందర్భంలో, తనకు బాధ కలిగినప్పుడో; ఆనందం, సంతోషం తనని ముంచెత్తినప్పుడో; తన తోటి వారికి ఇబ్బంది కలిగినప్పుడు మానవతా బంధాల వల్లనో; "హనుమాన్ చాలీసా" చదవకుండా ఉండరు.*
*అపర శంకర స్వరూపమై, అంజనా సుతుడుగా ఉద్భవించి, సకల జగత్తుకూ తన కాంతులతో వెలుగులనూ, కదలగలిగే శక్తిని ఇస్తున్న సూర్యనారాయణ మూర్తినే మెప్పించినవాడు, వాయునందనుడు, భీమాగ్రజుడూ, అన్నింటకీ మించి మూర్తీభవించిన మానవతా విలువల రామచంద్రమూర్తికి, తన తమ్ములు భరత, లక్ష్మణ, శతృఘ్నుల కంటే, ఎక్కవ అయినవాడు, సీతమ్మ తల్లికి పుత్ర సమానుడు అయిన "హనుమంతుని" స్మరించుకుందాము.*
*హనుమ - ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక బలం. శతృవులకు భయాన్ని, తనని నమ్మి కొలిచే వారికి అభయాన్ని, మానవ బలహీనతలను పోగొట్టి నరనరాల్లో నిండి నిలిచి ఉండే ధైర్యం. మానవ జీవనానికి ఆలంబనం. పసిపిల్లలకు ఉత్సుకత కలిగించే ఒక కార్టూన్ రూపం. ఏదో తెలియని ఒక భయంతో ఉండే చంటిపిల్లల కోసం, తల్లుల ఆసరా "ఆంజనేయ దండకం". వినయానికి నిలువెత్తు నిదర్శనం. మానవాళికి నిరంతంగా జయాన్ని చేకూర్చే "జయంకరుడు".*
*ఎదిగిన పిల్లలకు, యుక్తవయస్సులో ఉన్న వారికి, మనలో ఉన్న శక్తిని, పరమాత్ముని నమ్మి ముందుకు కదిలితే విజయం మనదే, అనే నమ్మకాన్ని కలిగించే నమ్మకం. ఈ నాడు, ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నేటి యువత, తప్పనిసరిగా నేర్చుకోవలసిన "కమ్యూనికేషన్ స్కిల్స్", అలనాడే ఆచరించి చూపిన, ఆరితేరిన కమ్యూనికేటర్. సీతాదేవిని చూసి వచ్చి, "కంటిన్ సీతను" అని చెప్పి రామునిలో ఆతృతను తగ్గించారు. రావణ సభలో, "రామ బంటుని" అని చెప్పి రాముని గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు.  ఈ రోజుల్లో లాగా ఏదో చెప్పేయాలి అని కాకుండా, ఏది చెప్పాలో అది మాత్రమే, ఎంతవరకు చెప్పాలో అంత మాత్రమే చెప్పిన అత్యద్భుతమైన శక్తి హనుమ. నేటి, మన యువత నడతకు నిలువెత్తు ఆదర్శం.*
*ఇంతటి అద్భుత శక్తి వంతుడైన హనుమ, కేవలం తమలపాకులు ఇస్తే సంతోషిస్తాడు. వడమాలా ప్రియుడై, తనకు వడలు పెడితే, ఒడలు పెంచి మనకు అండగా ఉంటాడు. అటువంటి శక్తిని

స్మరించుకుంటూ..... "హనుమాన్ చాలీసా" చదువుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు