జక్కాపూర్ బాల కథకుల విజయ కేతనం

ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాలలో సిద్దిపేట జిల్లా లోని జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 4 గురు 10 జీపీఏ పాయింట్లు సాధించారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు బాల కథకులు కావడం విశేషం. మట్టే తేజస్విని 6 కథలు,కయ్యాల నిఖిత 8 కథలు,6 కవితలు ,కొంగరి అభిషేక్ 4 కథలు,5 కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి.కొన్ని కథలు జాతీయ స్థాయిలో బహుమతులు కూడా పొందినవి.ఇక సూరగొని అశ్విత్ చిత్రకారుడు. అటు చదువులో, ఇటు సాహిత్యం లో రాణిస్తున్న విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.


కామెంట్‌లు