మీరు తరించేరు లే... ! కోరాడ నరసింహా రావు.
 
వెనుకనుండి ఎవరో పిలిచినట్టుగా... ఆ ఉలికిపాటు ఏలనే వయ్యారీ.... !!
   నీ వయసు కలవ రింతల మై మర పే  అది... !
నీళ్ళరేవుకాడి కొస్తానన్న ప్రియుడు, వచ్చేననా... !
  వచ్చి నిన్ను వెనుకనుండి... 
... పలుకరించేననా... !!
అది నీ భ్రమకాదు, నిజమే... 
 అవ్వాలని..., 
. మీ ప్రేమ ఫలించి మీ ఇద్ద రొక్కటవ్వాలని.., 
   నీమదిలోని, ఆ భావాలు ఫలించేనులే.... !
.  ఆలు, మగలై మీరు... 
       తరించేరులే.... !!
   మీరు  తరించేరు లే.... !!!
        *****

కామెంట్‌లు