* చిత్ర కవిత *;- కోరాడ నరసింహా రావు.

 ఏ గ్రహంలోనూ లేని జీవచైతన్య విస్తృతి ఈ భూ గ్రాహం లోనే... అనుకుంటే... 
యే గ్రహంనుండి వస్తున్నారో ఏలియన్స్.... !
ఇంకొక  గ్రహవాసులు వేరొక గ్రహవాసులకు వింత జీవులే !
 మనం వాళ్లపేర్లేమైనా కావచ్చు మనం పెట్టిన పేరు..ఏలియన్స్!
   మనకే పేరు పెట్టారో వాళ్ళు !!గ్రహాంతర వాసులు ఫ్లయ్యింగ్ సాసర్స్ పై ఈ భూమ్మీదకు రాగలిగారంటే... వాళ్ళ విజ్ఞాన వికాసం మెచ్చుకోదగ్గదే కదూ.. !
  ఇంతవరకూ మనమే గొప్పవాళ్ళమనుకుంటే... మీ తలలను తన్నేవాళ్ళం మేమున్నామంటూ వాళ్ళు ప్రత్యక్ష మయ్యారు... !!
    ఇంతవరకూ మనిషి... చంద్రునిపై మాత్రమే కాలు మోపగలిగాడు... అంతేనా  !
  అవతార్ అంటూ మరో అద్భుత సృష్టిని కూడా చేయగలిగాడు !
   ఈ మనిషి మొదటినుండీ అంతే... !
   యే చిన్నవిషయాన్నైనా ఛాలెంజ్ గా తీసుకుంటాడు !
  శోధించి విజయాలను సాధిస్తాడు.... ! 
   కాబట్టే అంతరిక్షణాన్ని అరచేతులతో తడిమేస్తున్నాడు 
    సముద్ర గర్భాలను అరికాళ్లతో కొలిచేస్తున్నాడు !!
    ఇంతకీ ఏలియన్స్ ది ఏ గ్రహమో..., ఆ గ్రహం లోని విశేషాలేమిటో... !
   ఇంతకూ ఈ ఏలియన్స్ కేవలము ఈ మనిషి భావనా రూపకల్పన కాదుకదా.... !!
    ఈ ఏలియన్సే నిజమైతే.... 
మన భూగ్రహ వాసులకు ఆ గ్రహవాసులు తోడై నట్టే... 
 ఇదిమెచ్చుకోదగ్గ పరిణామమే!
  గ్రహాంతరవాసులారా.... మా మనుషులం కోరుకునేది, ఎవరితోనైనా మితృత్వమే... !
  మీకు, మా సాదర స్వాగతం !!
     ********
కామెంట్‌లు