నాలాగ ఎందరో...;- - కె.కవిత- హైదరాబాద్
కంటేనే అమ్మ అని అంటే ఎలా?..
ప్రేమను పంచలేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా....
ఏనాడో కవి కలం వదిలిన బాణాలు..
నాలాంటి వారికి ఉపశమనాన్ని కలిగించే ఓషధులు...

కొన్ని ప్రశ్నలు అంతర్మథనాన్ని నిలువునా దహిస్తున్నాయి....

తల్లి ప్రేమకు హద్దులేదు..అవునా?
తల్లి ఉంటే చెంత
దరిచేరదు ఏ చింత..నిజమా?

తల్లి ప్రేమను విషమ పరిస్థితులనే మబ్బులు కమ్మేసాయా?

అన్నిటికీ కర్త అయిన తండ్రిని నిలదీయలేని పరిస్థితి....

మనసులో రగులుతున్న దావాగ్ని పెదవి దాటితేనే ...అగ్ని చల్లారేది..
సమస్యలకు పరిష్కారం దొరికేది..
లేనిచో జీవితమంతా నిప్పుల కుంపటే!!



కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
మీ మనో వేదన అని తెలుస్తోంది.
చాలా బాగా వ్యక్తపరిచారు
Sreekar Vyas చెప్పారు…
👏👏👏