తాత సుద్దులు! అచ్యుతుని రాజ్యశ్రీ

 సాయంత్రం కాసేపు ఆడుకుని వచ్చారు పిల్లలు. శుభ్రంగా కాళ్ళు చేతులు మొహంకడుక్కుని రాగానే దీపారాధన చేసిన తాత చప్పట్లు చరుస్తూ భజన చేయించాడు. "పిల్లలూ! ఇలాచప్పట్లు చరచటంవల్ల చేతినాడులు స్పందిస్తాయి.రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందుకే మనపూర్వీకులు భజనలు చేస్తూ వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది అని గ్రహించారు.శరీరం లోని పాపాలపక్షులు ఎగిరి పోతాయని చెప్పేవారు. శివాలయంలో శంఖం తప్పక ఊదుతారు.దాని వల్ల ఊపిరి తిత్తులు బలంగా ఉండి శుభ్రపడుతాయి.శంఖధ్వని వినిపించినంత మేర రోగక్రిములు నశిస్తాయని బెర్లీన్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా తేలింది. చేతికి గాజులు వేసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే పకపకా నవ్వడం ఏడ్చేవారిని వీపు తల నిమరటంలో గూడా అంతరార్ధం ఏమంటే  స్పర్శ వల్ల మానసిక వేదన తగ్గుతుంది. " తాత చెప్పింది విన్నాక అంతా తలా కాసేపు శంఖం ఊదారూ.ఆపై హారతి కళ్ళకద్దుకుని ప్రసాదం తిని అమ్మ పిలవటం తో ఎనిమిది లోపలే రాత్రి భోజనం ముగించారు.తాత చెప్పారు "మనం నిద్రపోయే టైం కి అన్నం కాస్త అన్నా అరగాలి" అని 🌹
కామెంట్‌లు