సుప్రభాత కవిత - బృంద
మంచుపువ్వుల
మాయని పరిమళం
పచ్చని తీగల
ముచ్చట ఒక క్షణం

వీడని మమతల
వెచ్చని పరవశం
కరిగినా చెరగని
మురిపాల జ్ఞాపకం

ఎపుడొచ్చి వాలునో!
ఎందాక నిలుచునో!
ఎపుడు వీడిపోవునో!
ఎంత ముద్ర వేయునో

జీవిత గమనాన
తెలియని అనుబంధాలు
ఎపుడొచ్చి చేరునో
ఎపుడు మాయమవునో!

మనసున్న మనసుకే
మమతలన్నీ
అది లేని మనిషికి
అన్నీ అనవసరాలే!

మనకై విరిసే చిన్నినవ్వైనా
మన కోసం చేసే ప్రార్థనైనా
దరి చేరి దయతో మాటాఢినా
ఋణానుబంధమే తప్ప మరొకటి కాదు

చెలిమి నిండిన మనసు
చెరువు లాటిది
పడిన ప్రతి స్నేహపు చినుకునూ
ప్రేమగా ఒడి చేర్చుకుంటుంది

సృష్టి లో మధురమైన 
స్నేహాల సాహచర్యం
అందరికీ దొరకని
అమృత ఫలం...

పొడిచే పొద్దున
దిగివచ్చే వెలుగురేఖలు
స్నేహ పరిమళాల మోపులు
ముంగిటిలో దింపే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు