'అయ్యలసోమయాజుల'కు రవీంద్రభారతి లో సత్కారం


  తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు కవనకిరణాలు తెలుగు సాహితీ సమాఖ్య  ముంబై ఆధ్వర్యంలో జాతీయ స్థాయి  కవితాసంకలనములో సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.రసాయనశాస్త్ర విశ్రాంతశాఖాధిపతి విశాఖపట్నం కవితకు  స్థానం లభించింది. ముఖ్యఅతిధి ప్రసిద్ధ సాహితీవేత్త తెలంగాణ ప్రధమ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు,కవి రచయిత్రి శ్రీమతి పి. పద్మావతి గారు,నేటినిజం సంపాదకులు  శ్రీ బైస దేవదాసు గారు, శ్రీ దేవానంద నాగేల్ల  గారు బహుజన సాహిత్య అకాడమీ మహారాష్ట్ర అధ్యక్షులు ,డాక్టర్ దీపక్ న్యాతి గారు సినీ దర్శకులు నంది అవార్డ్ గ్రహీత,శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు కవి,సినీ గేయ రచయిత 
శ్రీ సాహిత్య ప్రకాష్ సినీ, టివి నటులు న్యూస్ రీడర్
ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో  మెడల్, దుశ్శాలువ మరియు ప్రశంసా పత్రంతో నందిని సిద్ధారెడ్డి గారు స్వహస్తాలతో సత్కరించారు. కవనకిరణాల సాహితీ సంస్థ అధ్యక్షుడు శివ మంచాల మరియు కార్యనిర్వాహక సభ్యులు  అభినందనలు తెలియచేశారు. సాహితీ మిత్రులు,స్నేహితులు ప్రసాద్ మాస్టర్ కి శుభాకాంక్షలు తెలియచేశారు.
............................
కామెంట్‌లు