జీవవైవిధ్యం-సహచర్యం (చిట్టి వ్యాసం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఈ భూమ్మీది సమస్తజీవరాశి ఎప్పుడో ఒకప్పుడు ఒకటికొకటి అవసరపడుతుంటాయి.
మనుషులు, వృక్షాలు, జంతువులు,
పక్షులు, కీటకాలు, సూక్ష్మక్రిములు
ఇలా వైవిధ్యభరితమైన జీవజాలం
ఒకదానిపై ఇంకొకటి ఆధారపడి ఉన్నాయి. ఏఒక్క జీవికి కొరత ఏర్పడినా
మిగతా జీవుల జీవనం కష్టాలపాలవుతుంది. మనిషి తనచుట్టూ వైవిధ్యభరితమైన జీవరాశుల సహచర్యంతోనే మనుగడ సాగిస్తున్నాడు. ఏ జీవరాశి ఎంత ఉండాలో ప్రకృతే నిర్ణయించింది.
కాని, మనిషి తనస్వార్థంతో ఆ జీవుల మనుగడను దెబ్బతీస్తుంటే ఆ ప్రకృతి ఊరుకుంటుందా? అందుకే, ప్రకృతిని ప్రేమిద్దాం! సర్వభూతములందు భగవంతుని చూద్దాం! ఏజీవికీ కష్టనష్టాలు కలగకుండా చేద్దాం! మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం!!!
+++++++++++++++++++++++++



కామెంట్‌లు