ఎవరు..ఎవరూ..?;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
కోకిలమ్మ గొంతులో
అమృతం పోసిందెవరు?
చిలుకమ్మ పలుకుల్లో
చక్కెర నింపిందెవరు?

ఆకాశ వీధిలోన
తారలను పెట్టిందెవరు?
శూన్యంలో సృష్టిని
కలుగజేసిందెవరు?

ఊయలలా భూమిని
వ్రేలాడ దీసిందెవరు?
సూర్య చంద్ర తారలకు
వెలుగులద్దిందెవరు?

కాలానికి వేగాన్ని
ప్రసాదించిందెవరు?
మనిషి నాసికలో
ఊపిరి ఊదిందెవరు


కామెంట్‌లు