చిత్రస్పందన //- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
తేటగీతి //

తనువు బాధతో గాసిలన్ వణుకు చుండి 
మండు టెండలో బిడ్డలు మాడుచుండి
కూటి కోసము పాపము కూలి పనులు
చేయు చుండిరీ పసివారు చింత పడుచు.

శిలల యందున బ్రతుకులు ఛిద్రమగుచు 
చిన్న బిడ్డల మోములు జేవు రించె.
తిండి బెట్టుచు బ్రతుకును తీర్చిదిద్ది
చదువు చెప్పించు వారలీ జగతి యందు
కాన రారమ్మ!దురితపు కాలమందు.//
కామెంట్‌లు