అక్షర జ్వలా తోరణం శ్రీ శ్రీ;- ఎం. వి. ఉమాదేవి.నెల్లూరు
 ఆయన మనో మందిరానికి
జ్వలించే అక్షర తోరణాలు
గవాక్షాల్లోనుండి
దూసుకు వచ్చే ప్రశ్నల దివిటీలు
ఒక్కో మూలనా వెలుగులయ్యే
సమానత్వ ప్రమిదలు
శితిలమైన మానవత్వకోటలో
వృద్ధురాలి విహ్వల దీనత్వం
మూగజీవులు, ప్రకృతి
కలిసి విలపిస్తూ...
ఇది శ్రీ శ్రీ కలం ముద్ర!!
ఎర్రని సిరాతో ఎడతెగని
ప్రపంచపు దౌర్బాగ్యం వర్ణన!!

కామెంట్‌లు