తాత చుట్టూ పిల్లలు చేరి పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు
"ఏమర్రా! ఉత్తర భారతంలో 7రాష్ట్రాల్లో జరిపే పండుగలగూర్చి తెలుసా?" తెల్లమొహాలేశారు అంతా!"పుస్తకాలు చదివితే తెలుస్తాయి. సరే నేనే చెప్తా వినండి. అ తో మొదలు అయ్యే రాష్ట్రం ఏది?" అస్సాం అని అరిచారు అంతా!"అస్సాం లో అతిపెద్ద పండగ బిహు.అరుణాచల్ ప్రదేశ్ లో లోసార్ కొత్త సంవత్సరం రోజు గేదెకొమ్ముతో చేసిన బూర పెపాఢోలక్ తోఆడిపాడుతారు.
మణిపుర్ లో నింగోల్ చాకౌబా పండగ రోజు వధువు పుట్టింటికి వస్తుంది. ఛిరోబా అనే కొత్త ఏడాది రోజు మణిపూర్లోని పల్లెవాసులు కొండ శిఖరాలను ఎక్కి"మేము జీవితం లో ఉన్నతిని సాధిస్తాం అని తెలుపుతారు.
మిజోరంలో చాప్చంకుట్ పండగ ని ఆదివాసీదుస్తుల్లో వాద్యాలు పాటల్తో జోరుగా చేస్తారు. మేఘాలయలో గారోజాతివారు వాన్ గాలాఅని
నూరు డ్రం ఢోలక్ లతో ఆడ మగ సమాంతరంగా నిలబడి డాన్స్ చేస్తారు. నాగాలాండ్ వాసులు మొఆస్ట్ అనే పండగ ని ఈకలు అడవిపంది దంతాలు నెత్తిపై ధరించి ఆడిపాడ్తారు.ప్రతినెల ఏదో ఒక పండగ ఉత్సవం ఆఏడు రాష్ట్రాల్లో జరగడం మామూలే ". తాత చెప్పి న విషయాలు విన్నాక పిల్లలు అట్లాస్ లో 7రాష్ట్రాలని గుర్తించే ప్రయత్నం లో పడ్డారు 🌹
త్రిపుర లో వేట చేపలు పట్టడం ఆహారం సేకరణ ఇంకా వృత్తాలకి సంబంధించిన పాటలు డాన్సులతో ప్రత్యేక అలంకారంలతో అలరిస్తారు."తాతా! ఇప్పుడు మేము వేరే రాష్ట్రాల గూర్చి తెలుసు కుంటాం" అని పిల్లలు పొలోమంటూ అరిచారు. 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి