*కోరాడ మినీలు*

  @ బ్రతకటానికే... !
                  ****
పులి మేకను చంపుతోంది... 
   కోళ్లు, గొర్రెలు మనుషులకోసంచేస్తున్నై !
   మనుషులు, మనుషులతోనే యుద్దాలు చేస్తున్నారు !!
   ఈ చంపటాలు - చావటాలు దేనికోసమో.... 
       ఇంకెందుకు... బ్రతకటానికే 
        *****
        * నిజంగా  గొప్పవే... !*
             *****
 చంపటానికే బ్రతికే మృగాలు, మనుషులకన్నా.. !
    బ్రతికించటానికి చనిపోయే... 
  మనిషైనా, మరే ప్రాణైనా... 
   నిజంగా... గొప్పవే.... !!
      ******"    దైవత్వం మూర్తీభవించి నట్టే*
          ***** 
ఈ చంపటాలు 
చావటాల  కన్నా....., 
   బ్రతికించటము - బ్రతకటము 
   చాలా గొప్పవి... !
  బ్రతుకు నిస్తూ... బ్రతికుతూ జీవించే   యే ప్రాణైనా..., 
   ఆ ప్రాణిలో, మానవత్వమే కాదు, దైవత్వమే మూర్తీభవించినట్టు... కదూ...!!
          *****
కామెంట్‌లు