ప్రతిభామూర్తులు.;- తాటి కోల పద్మావతి గుంటూరు

 కంచర్ల గోపన్న. (17వ శతాబ్దం)
ఇతడు రామదాసుగా ప్రసిద్ధుడు. ఈయన గోలుకొండను పాలించిన అబుల్ హసన్ తానీషా కాలము వాడు. అతని మంత్రులైన అక్కన్న, మాదన్నలకు మేనల్లుడు. ఈయన రామ భక్తుడు. తానీషా పాలనలో గల నేటి ఖమ్మం జిల్లా ప్రాంత తహసీల్దారుగా ఉండి సేకరించిన సుంకమును వెచ్చించి భద్రాచల రామాలయమును నిర్మించానని దానికి పరిహారముగా కారాగార శిక్ష అనుభవించనని చరిత్రకారుల అభిప్రాయము. ఈయన తన రామ భక్తితో దాశరధి శతకమును రచించెను. ఇది ఎన్నో శతకములకు మార్గదర్శియై నేటికిని సాహిత్య ప్రియులను అలరించుచున్నది.

కామెంట్‌లు