*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0273)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
నందిచే శుక్రాచార్యుని అపహరణ - శివునిచే మింగబడిన శుక్రాచార్యుడు, శివలింగము నుండి బయటకు వచ్చుట - శుక్ర నామము - మృత్యుంజయ జపము - శివాష్టోత్తర శతనామ వర్ణన - శివుడు అంధకునకు వరములు ఇచ్చుట......
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*నారదా! నంది తీసుకువచ్చిన శుక్రాచార్యుని శంభుడు మింగేసున తరువాత రాక్షస సైన్యం పరిస్థితి దయనీయంగా మారింది. వారికి దారి, తెన్నూ తెలియటల్లేదు. వారి సంఖ్యాబలమూ, శక్తి కూడా తగ్గుతున్నాయి. శూరతగవము లేని క్షత్రియ వీరులు లాగా ఉంది దైత్య సమూహం అంతా. దైత్య సైన్యం రణరంగం ను వదలి వేయడానికి సిద్ధం అవుతుండగా, వారిని చూచి అంధక దైత్యరాజు, "యుద్ధంలో వెన్ను చూపి పారిపోయిన వారికి ఉత్తమగతులు లభించవు. యుద్ధ భూమి లో మరణిస్తే పునర్జన్మ ఉండదు. యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది." అని ఉత్సాహ పరిచాడు. రాక్షస సైన్యం ఇనుమడించిన ఉత్సాహంతో దేవగణాల మీదకు మరల దండెత్తారు. దేవ అసుర సేనల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.*
*అప్పుడు, దేవ గుణములలో మహా బలశాలి అయిన వైశాఖడు, శంకరుని తలచుకుని అంధకుని తో యుద్ధానికి వచ్చాడు. త్రిశూలము, శక్తి, బాణమిలతో అగ్ని వర్షం కురుస్తున్నట్టు దాడి చేసాడు. అంధకుడు కూడా ప్రతిఘటన చేసాడు. కాని, శివుని అనుగ్రహం తో వైశాఖుడు, అంధకుని గ్రుడ్డివానిగా చేసాడు. ఈ పరిణామాన్న శంభుని ఉదరంలో ఉన్న శుక్రాచార్యుడు చూసి కూడా ఏమి చేయలేక, బయట ప్రపంచంలోకి వచ్చే దారి లేక అక్కడే తిరుగుతూ ఉన్నాడు. వృషభవాహనుని ఉదరములో శుక్రాచార్యుని కి సకల లోకములు, త్రిమూర్తులు, సర్వ సృష్టి కనిపిస్తున్నాయి. కానీ, బాహ్య ప్రపంచంలోకి రావడానికి దారి తెలియక నూరు సంవత్సరాలు ఉన్నాడు. కొంతకాలం తర్వాత, భృగుమహర్షి కుమారుడైన శుక్రాచార్యుడు, శివ యోగాన్ని ఆశ్రయించి ఒక మంత్ర జపం చేసాడు. ఆ మంత్ర పఠనం ఫలితంగా, శుక్ర కణ రూపంలో, శంంభుని జఠరం నుండి బయటకు వచ్చాడు.*
*అలా ఈశానుని ఉదరకుహరం నుండి బయటకు వచ్చిన శుక్రాచార్యుడు శివునికి నమస్కారాలు చేసి, కీర్తించాడు. కరుణాసాగరుడు, శంకరుడు, శుక్రాచార్యుని ప్రార్థనలు విని చిరునవ్వుతో అనుగ్రహించారు. పార్వతి ఆతనిని తన కుమారునిగా స్వీకరించింది. విఘ్న రహితునిగా చేసింది, అమ్మ. "ఓయీ! నీవు నా లింగ మార్గమున శుక్ర రూపంలో బయటకు వచ్చావు. కనుక ఇప్పటి నుండి, నీవు "శుక్రడు" అని పిలువ బడతావు. నీవు నా పుత్ర సమానుడవు"అని చేరదీసారు.*
*శంకరునిచే, శుక్రునిగా పిలవబడిన శుక్రుడు, ఆ పరమాత్ముని పాద పద్మములు పట్టి వేయి విధములుగా కీర్తించాడు. "దేవ దేవా! నీ రూపాలు, భుజాలు, పాదములు, శిరములు అన్నీ కూడా అనంతములు. ఇన్ని, అని లెక్కించడం ఎవరి వల్ల కూడా కాదు. నీ ఆకారాలు ఎనిమిది అని చెపుతున్నారు, కానీ, అది సరికాదు. అటువంటి నిన్ను, అల్పుడనైన నేను ఏవిధంగా కీర్తించ గలను. నీకు అనేక నమస్కారాలు." అని అనుగ్రహించాలని ప్రార్ధించాడు. తరువాత, దైత్య సేనలలో చేరాడు, పరమేశ్వర ఆజ్ఞతో.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు