*హనుమాన్ చాలీసా - చౌపాయి 31*
 *అష్ట  సిద్ధి  నవ  నిధి కే దాతా !*
*అసవర  దీన్హ   జానకీ   మాత !!*
తా: పారిజాత తరు మూల స్థితా ! ఆంజనేయ ! నిన్ను నమ్మి కొలిచిన వారికి, బుద్ది, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండ ఉండడం, రోగాలు రాకుండా ఉండడం, జడత్వం లేకుండా పోవడం, మాటలు మాట్లాడగల నేర్పు అనే ఎనిమిది నిధుల వంటి లక్షణాలను ఇవ్వమని సీతమ్మ నీకు వరం ఇచ్చింది........అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: శిరస్థానంలో విష్ణువు, హృదయ స్థానంలో మహేశ్వరుడు, పాద స్థానంలో బ్రహ్మ నిలిచి ఉన్న హనుమను కొలిస్తే తీరని కోరికలు ఉండే అవకాశం ఉంటుందా? ఈ స్వామి పూజకు, పటాలు విగ్రహాలను ఉంచవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. కావలసింది, హనుమ చేయగలడు అనే నమ్మిక.  ఆ నమ్మిక ఉంది కనుకనే, రామభద్రుడు అన్ని లక్షల మంది ఉన్న కపి సేనలో, హనుమకు మాత్రమే, తన గుర్తుగా  అంగుళీయకం ఇచ్చారు. పరమాత్ముడే నమ్మిన తరువాత, మనమెంత. అంతటి నమ్మికని, ఆ శంకరాంశుని మీద మనకు కూడా కలిగేలా అనుగ్రహించాలని....... అమ్మ భూజాతను వేడుకుందాము.*
*ఆన్ఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు