స్థితప్రజ్ఞత;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 జీవితంలో ఏ కుటుంబానికి అయినా  మంచి చెడులు జరగకుండా  ఒకటి మంచి జరిగితే మరొకటి చెడ్డది జరగవచ్చు  అలా అని తప్పకుండా అలాగే జరుగుతుంది అని చెప్పడానికి లేదు పరిస్థితుల ప్రభావం అలా ఉంటుంది  అందుకనే ఈ కష్టసుఖాలను కావిడి కుండలతో పోలుస్తూ మాట్లాడుతుంటారు జనపదులు  ఒక కావిడి వేసుకుని వెళ్ళేటప్పుడు  ముందు ఉన్న మట్టులో సుఖాలు వెనక ఉన్న మట్టులో  కష్టాలు ఈ రెంటనీ సమపాళ్లలో అనుభవించగలగడం కోసమే ఈ కావిడి  సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆంగ్లంలో  ఇలాంటి విషయాలు అనేకం ఆంధ్ర భాషలో చెప్పవచ్చు  కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు  నానుడులు అనుకోకుండా వస్తాయి ఆంధ్రుల జీవితంలో అది ఒక భాగం అని చెప్పవచ్చు.
జీవితంలో అనేకమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా  ఈ స్థితి నుంచి తప్పించుకోలేరు  నాకు సంసారం ఈదటం చాలా కష్టంగా ఉంది  నా భార్య చెప్పిన మాట వినడం లేదు నన్నేం చేయమంటారని ఒక యోగిని అడిగితే  అది భరించ లేకనే కదా గడ్డాలు అన్ని బంధాలు తెంచుకుంటూ  మీలాంటి వారి దగ్గర అడుక్కు తినడానికి వచ్చింది  అని సమాధానం చెప్పాడు  అని ఒక కథ. సంసారంలో అందరు గృహస్తులు అదృష్టవంతులు అయి ఉండరు  కొందరు  అందంతో పాటు సుగుణాల రాశి అయిన  భార్యతో కాపురం చేస్తూ ఉండవచ్చు  మరొకరు క్షణక్షణాన భర్తను ఇబ్బంది పెడుతూ అనరాని మాటలతో మానసికంగా హింసిస్తూ అతని జీవితాన్ని నరకం చేసే  స్త్రీలు ఉండవచ్చు  మంచి భార్య దొరకడం కూడా అదృష్టమే. అలా భార్య చేత హింసించబడుతూ  శాంతి లేకుండా చేస్తున్న కుటుంబాలను  ఉదాహరణగా తీసుకున్నట్లయితే  తుకారాం లాంటి గొప్ప భక్తులు కావడానికి కారణం అతని గృహిణి అని పెద్దలు చెప్తారు  అందుకే  భక్తిని ఆశ్రయించి  ఆ కష్టాల నుంచి విముక్తిని పొందాడు  అలాగే అద్భుతమైన సుగుణాలతో  గృహిణికి ఉండవలసిన  లక్షణాలన్నీ  ఉండి సక్రమంగా  సంసారం జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని  ఆ బాధ్యతల నుంచి  బయటపడి భార్యపై ఉన్న నమ్మకంతో  ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టిన మహానుభావుడు సంత్  ఏకనాధ్ అని పెద్దలు చెబుతారు  కనుక కష్టమైనా సుఖమైనా భగవంతుని  ప్రసాదమే అని భావిస్తే అది నిజమైన భక్తికి తార్కాణం  అలా జీవించిన వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. గీతా ప్రవచనంలో కూడా ఆ విషయమే శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేశారు.



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం