ఎండ మట్టి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 వడ గాలుల తుఫాన్ 
మొదలైంది...
ఆకులు చినుకులై రాలి
నేలను ముద్ధాడుతున్నాయి...
వెలుగు తన ఉష్ణోగ్రతను పెంచుకొని 
పైకి ఉరుముతుంది... 
విడిది లేని పంచ క్రింద ఒళ్ళంతా 
సెగలు కమ్ముతుంటే...
నిర్మానుష్యమైన నగరాలలో
రహదారులన్నీ నీళ్ళు లేని 
సముద్రాలయ్యాయి...
చర్మపు ఊబి నుంచి
చమట నీళ్ళు ఊరుతుంటే...
ఉక్కపోత 
ఊపిరాడనివ్వని పరిస్థితి...
సూర్యుని భగ భగల మధ్య 
నిస్సత్తువయ్యింది శరీరం ఈ
వేసవిలో...
అడుగు బయట పెడితే 
ఎండ మట్టి మీద పడుతుంది...
వేడి నుంచి ఊరట పొందాలంటే
చల్లని పానీయాలతో స్నేహం 
తప్పనిసరి...
స్వీయ సంరక్షణలో భాగమైన 
అస్త్రాలే ఛత్రాలు...
రేగిన దుమ్ము, కళ్ళను
కమ్మేస్తుంటే బేజారైన ప్రాణం
కాస్తంత చల్లదనం కోరుకుంది ఓ చెట్టు నీడను 
బ్రతిమిలాడి...కామెంట్‌లు