బాల మేధావి; - డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసునిగా పని చేయడం  సుకృతం అనే చెప్పుకోవాలి  అక్కడ  మాటలతోనే పని  వారి సత్తాను ప్రదర్శించడం వరకే వారి బాధ్యత  అతి సాత్విక మూర్తి మా ఎన్ సి వి జగన్నాథ చార్యులు గారు  ఒక సందర్భంలో ఆయన రాముడు, ఆనంద్ గారు లక్ష్మణుడు వేషాలు నాటకంలో వేయవలసి వస్తే  రెండు మూడు మాటలు చెప్పిన తర్వాత  నాకూ ఆనంద్ గారికి  పాత్రలను మార్చినట్టుగా అనిపిస్తుంది  సాత్విక మూర్తి  శ్రీరామచంద్రుని వేషంలో  జీవించాలి అంటే అది ఆనంద్ గారికే సాధ్యం నాకు కాదు. నేను వారి తమ్ముడు లక్ష్మణస్వామి పాత్రను నిర్వహించగలను అని చెప్పడం నాకు చాలా  ఆశ్చర్యం కలిగించింది. మనసులో అనుకోవలసిన మాటలు బయటకు చెప్పారా అనిపించింది.
నిజానికి ఆచార్యుల వారి ఉద్యోగం తంబురా వేయడం  మంచి సున్నితమైన  సంగీత విద్వాంసులు  గాత్రంలో బాలమురళీకృష్ణ గారి తరువాత  దాదాపు వారిలా పాడగలిగిన  గాత్రం ఆయన సొంతం  వారికి ఏ అనుమానం వచ్చినా  వారి అన్నగారు కృష్ణమాచార్యులు గారిని  మాత్రమే అడిగి తన సందేహాన్ని నివృత్తి చేసుకుంటారు. ఆయన ఏ విషయాన్ని గురించైనా  వినడం తప్ప చెప్పడం తక్కువ  అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం  ఎంత అనర్గళంగా చెప్పగలరో అనవసరమైన విషయాలను  మాట్లాడకపోవడంలో అంత మౌనాన్ని వహించగలరు. అలాంటి మంచి వాడికి అన్నీ మంచే జరిగాయి కానీ  మా అందరికీ అభిమాన పాత్రమైన వారి  కుమార్తె  మరణం  అతి చిన్న వయసులో జరగడం  వారిని ఎంతో కృంగదీసింది. చిన్నారి సీత మరణం వల్ల  దాదాపు  సగం జీవితాన్ని పోగొట్టుకున్నట్లే  మా అందరికీ అంత చిన్న వయసులోనే ఎన్నో సలహాలు చెప్పగలిగిన  మేధావి  బాల బాలికల పాత్రలు మాతో పాటు అనేక నాటకాలలో పాల్గొన్న చిన్నారి  మరణం మా అందరికీ  విషాదం  కలిగించిన సంఘటన  మాకు ఉదయం జరిగే కార్యక్రమాల్లో  మీటింగులకు  అనేకసార్లు సీత  వారి ఇంటి దగ్గర నుంచి పదార్థాలను తీసుకొచ్చి  మా అందరికీ ఆప్యాయంగా వడ్డించిన రోజులు  ఇప్పటికీ మర్చిపోలేం  మా అందరితో  కన్న బిడ్డలా అందరి ఆప్యాయతలు  పొందిన బంగారు తల్లి మా సీత  చిన్నతనంలోనే  తండ్రి తో పాటు సంగీతాన్ని ఆలపించగలిగిన  సామర్ధ్యాన్ని కూడా తన సొంతం చేసుకున్నది  అలాంటి బిడ్డను మరిచిపోవడం  అసాధ్యం అసంభవం  మాకే ఇలా ఉంటే కుటుంబ సభ్యులకు ఇంకెలా ఉంటుందో ఆలోచించండి.


కామెంట్‌లు