జీవిత పాఠాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏ వ్యక్తికైనా జీవితంలో అనేక పాఠాలు  నేర్చుకునే అవసరం ఉంటుంది  పుస్తకాలలో ఉన్న అక్షరాలను గుర్తుపట్టి పేజీలను తిరగవేయటం కాదు చదువు. లోకజ్ఞానం ఉండాలి  ఎంతో కష్టపడి ఒక వ్యక్తి  పరశువేదిని సంపాదించి  చనిపోయిన వారిని బ్రతికించే మంత్రాన్ని  తెలుసుకొని అనేకమందిని  బ్రతికించిన అనుభవం ఉంది  అతని పెద్ద తమ్ముడు  బాగా చదువుకున్నాడు  ఉద్యోగం కూడా వచ్చింది  అమ్మను నాన్నను ఎంతో ప్రేమగా  చూసుకుంటూ ఆ కుటుంబం ఆనందంగా గడిచిపోతోంది  చిన్నవాడు మూడోవాడు  వీరిలాగా ఏ విద్యకు నోచుకోలేదు  అంత మాత్రం చేత అతనికి తెలివి లేదు అని అనుకుంటే పొరపాటు  తెలివైన వాడే కానీ అంత జ్ఞానం మాత్రం లేదు  ఆ కుటుంబం అలా హాయిగా ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. ఈ చిన్న కుర్రవాడు  ఆ గ్రామంలో అందరికీ పరిచయమైన వాడే  చాలామంది కూర్చున్న వారు వారికి కావలసిన పనులను ఇతని ద్వారా చేయించుకుంటూ ఉంటారు.  ఎవరికి చేయను అన్న మాట అతని నోటి నుంచి రాదు  ఎవరు ఏ పని చెప్పినా దానిని  నిష్టతో చేస్తాడు  వారు ఏదైనా తినడానికి ఇచ్చినా ధన రూపంలో సహాయం చేయాలని అనుకున్నా  సుతరాము అంగీకరించడు దానితో అందరికీ అతి సన్నిహితమయ్యాడు  పెద్దవారిద్దరూ కూడా  మరణించిన వారిని జీవించేలా చేసి వారు ఎంత ఇవ్వడానికి అయినా సిద్ధపడిన  వారి నుంచి ఏమి ఆశించకుండా  ఉచితంగా ఆ పని చేసి పెడుతూ ఉండేవాడు  రెండవ కుర్రవాడు కూడా అంతే  దానితో ఈ కుటుంబం మీద ఆ గ్రామస్తులందరికీ చాలా సదభిప్రాయం ఉంది  పరోపకారం కోసమే వీరు జీవిస్తున్నారు అన్న అభిప్రాయం వారందరికీ ఉంది
ఒక పర్యాయం పెద్దవాడికి  ఒక ఆలోచన వచ్చింది  మనం ఇంత మంచి పని చేస్తున్నాము కదా రాజుగారికి కూడా ఈ విషయం తెలిస్తే మన మంచి  వారు కూడా గ్రహిస్తారు కదా అని మిగిలిన ఇద్దరు తమ్ముళ్ల తో కలిసి బయలుదేరి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో  అడవిని దాటి వెళ్ళవలసి వచ్చింది మధ్యలో  వారికి ఒక సింహం కళేబరం కనిపించింది  దానిని బ్రతికిస్తే రాజుగారు సంతోషిస్తారు అని పెద్దవాడు ప్రయత్నం చేస్తే చిన్నవాడు వద్దన్నయ్య  అది క్రూర మృగం  అది బ్రతకగానే ముందు ప్రాణం ఇచ్చిన నిన్ను చంపుతుంది  అన్నా వినకుండా ఆయన ప్రయత్నం ఆయన చేశాడు  అదే సమయం అనుకొని ఆ చిన్న వాడు ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు  ఆ సింహానికి జీవం వచ్చి ఎదురుగా ఉన్న ఇద్దరినీ  తినేసింది.  కనక పిల్లలూ జీవితంలో మీకు కావాల్సింది లోకజ్ఞానం  దానికోసం కూడా మీరు ప్రయత్నం చేసి  ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలి అన్నది నా  ఆకాంక్ష  అందుకే ఈ సంఘటన మీకు చెప్పాను.



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం