ఓ వానమ్మా రావమ్మా!!*: ప్రభాకర్ రావు గుండవరం (కలం పేరు : మిత్రాజీ )ఫోన్ నం.9949267638

 ఏవీ నల్లని మబ్బులు
కానరావేమిటీ??!
రోళ్లు పగులగొట్టే రోహిణి కార్తె
ఎండలు పోయి
మిర్గం వచ్చింది కదా
వాన చినుకుతో పుడమి పురుడు పోసుకోలేదేమిటీ?!
ఆకాశం వైపు కన్నులు వత్తులు
చేసుకుని చూసే అన్నదాతలు
ఆర్తిని చూసి రావే ఓ మబ్బమ్మా
చినుకులు చిందిస్తూ నాట్యం చేయమ్మా
***********
కామెంట్‌లు