చిత్రానికి పద్యం. సాహితీసింధు సరళగున్నాల
ఎల్లలోకముల్ గాచుచునుల్లమందు
నాడబిడ్డల కవనిలో నైదవతన
మిచ్చు జననివి యవనిలో నెవరుసాటి
అమ్మ దేవేరి పార్వతీ హారతిదియె

రుధిరమ్మాయాకుంకుమ
చెదపురుగులజీల్చినిలువ చిందినదదియా
వదిలించిన నాపాపుల
పదితలల ధరించినావు పావని జననీ

కంటిన కోపపుదరువులు
నంటిన రుధిరంపుకురులు ,నటనాసికపై
యంటిన ,నుదుటన రక్తము
మింటికి పోబోయెదుష్ట మేళమునదియే

కామెంట్‌లు