నిరాశ (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అనుకున్నది ఒకటి, అయినది మరొకటి ఐతే? అంతా భ్రాంతికాకుండా మరేమవుతుంది? కలలోకి వచ్చినది ఇలలోకి రాకపోతే? వస్తుందనుకున్న ఉద్యోగం రాకపోతే? జరుగుతుందనుకున్న న్యాయం జరగకపోతే? చేతికొస్తుందనుకున్న పంట వరదల్లో కొట్టుకుపోతే? గిట్టుబాటుధర వస్తుందనుకున్నది రాకపోతే? ఉన్నదంతా ధారపోసి బిడ్డలను పెంచిపెద్దచేస్తే, వారు వృద్ధులను ఇంటినుండి వెళ్ళగొడితే?
హృదయపూర్వకంగా ప్రేమించినవాడు
నమ్మించి మోసంచేస్తే? నిస్పృహ ఆవరించి నిర్వీర్యులుగా మార్చివేస్తుంది ఈ నిరాశ. కాని, జీవితంలోని ప్రతి సంఘటన నిరాశ కలిగించేదిగానే ఉండదు. ప్రేమ, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, ఆప్యాయత, అనురాగం, దయ, జాలి, కరుణాపూరిత వాక్కులు, క్రియలు ఇలాంటి అనేక ఓదార్పులు కూడా మనకోసం చాలా ఎదురుచూస్తున్నాయి. అందుకే, అంతా నిరాశ కాదు. కాకూడదు సుమా!!!
+++++++++++++++++++++++++
కామెంట్‌లు