చిత్రానికి పద్యం;-సాహితీసింధు సరళగున్నాల
జంటచిలుకలు నొకచోట సరసమాడ
చూచి తనవాని కోసమై వేచిచూచి
వలపు వేదనల్ నిండగా పడుచుపిల్ల
చేతివేళ్ళను తిప్పెను చిలుకవలెను

ఒంటరితనమే బరమని
జంటనుచూడంగ తనదు జాడనెరుంగన్
చంటిది వాకిట నిలిచిన
కంటికి కనురెప్పనైన కనుమూయదుగా

పరువాల పడుచు చిన్నది
మరులే గొల్పంగవయసు  మగడినివెదుకన్
మరిమరి గాంచగకన్నులు
తరుణముకైవేచె వీణ దరువేయుటకై

కామెంట్‌లు