* పద... పద... పదరా..... ! *- కోరాడ నరసింహా రావు.. !
పద... పద... పదరా.. తన్వీరు 
నువ్ పద, పద, పదరా కిరణ్మెహరు !
      పడండి పళ్ళు తోమండి.... 
టంగ్ క్లీను బాగాచెయ్యండి... 
సబ్బుతో ముఖాలు కడగండి... 
వడి, వడి గా మీరు కదలండి... 
సమ్మర్   కేంపుకు పడండి... !
   
వ్యాయామం చేయిస్తారు... 
  ఆసనాలు వేయిస్తారు... !
 ఆటలెన్నొ  ఆడిస్తారు..., 
 ఎగ్గు, బిస్కెట్ లిస్తారు.... 
 ఎనర్జీ డ్రింకులు తాగిపిస్తారు 
     పద, పద, పదరా తన్వీరు 
నువ్ పద, పద, పదరా కిరణ్ మెహెరు...!
       
రియాన్స్  గౌతము వస్తారు 
ఆసీస్ ను, ఈషా ను తెస్తారు !
 అన్నయ్యలు కూడా వస్తారు... 
 ఆటలెన్నొ  ఆడిస్తారు... !!
     
పద, పద, పద రా  తన్వీరు 
నువ్  పద, పద, పద రా కిరణ్మెహరు.. !!
      *******

కామెంట్‌లు