సత్య జ్ఞానం;- - యామిజాల జగదీశ్

 భక్తుడు : సత్య జ్ఞానం పొందేందుకు శాస్త్ర జ్ఞానం తప్పనిసరా ?
భగవాన్ రమణమహర్షి : నువ్వు రోజూ షేవింగ్ చేసుకుంటావా?
భక్తుడు : ఔను. 
భగవాన్ : అలాగైతే క్షవరం చేసుకుంటు న్నప్పుడు అద్దాన్ని ఉపయోగిస్తావు కదూ? అద్దంలో కనిపించే నీ ముఖ బింబానికి క్షవరం చేస్తున్నావా? అద్దంలోకి చూసకుంటూ నీ ముఖానికి కదా క్షవరం చేస్తావు. అలాగే శాస్త్ర జ్ఞానమంతా సత్యానికి దారి చూపించే మార్గమవుతుంది. 
శాస్త్రాలన్నీ చదివితే మాత్రమే సత్యాన్ని తెలుసుకోలేవు. "ఉట్టినే ఉండు" అది సత్యం. "మౌనంగా ఉండు" అది భగవంతుడు.

కామెంట్‌లు