*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - పంచమ (యుద్ధ) ఖండము-(0282)*

 బ్రహ్మ, నారద సంవాదంలో.....
బాణాసురుని ఘోర తపస్సు - ఉష స్వప్నంలో అనిరుద్ధుని కలవడం - అనిరుద్ధుని అపహరణ - నాగఫాశ బంధనం - దుర్గాస్తవం - శోణితపురము మీదికి శ్రీకృష్ణ దండయాత్ర - శివునితో యుద్ధం - జృంభణాస్త్ర ప్రయోగము - బాణుని సైన్య నాశనము.....
*"ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం"*
*దానవులలో, రాజనీతిజ్ఞులలో శ్రేష్టుడై, బాణునికి మంత్రాంగం నడిపించే వాడు అయిన కుంభాండుని మాటలు విన్న అనిరుద్ధుడు, శత్రువును శరణుకోరి జీవించడం కంటే యుద్ధం లో చనిపోవడం ఉత్తమము అని అనేక విధాలైన క్షత్రయ ఉచిత మాటలు మాట్లాడాడు. అనిరుద్ధుని మాటలు విన్న బాణుని సభ ఆశ్చర్యం లో ఉండగానే, సభలోని వారందరూ వింటుండగా, అశరీరవాణి తన మాటలు ఇలా వినిపించింది.*
*"నిన్ను నీవు మహా బలవంతుడిగా అనుకుంటున్న, బాణ చక్రవర్తీ ! విను. నీవు బలిచక్రవర్తి కుమారుడవు. అచంచలమైన శివ భక్త పరాయుణిడివి. నీవు కోపమునకు లొంగి పోవుట మంచిది కాదు. నీకు తెలిసిన విషయమే. అయినా విను. ఈ సర్వ జగత్తు కూ స్వామి, సదాశివుడే. బ్రహ్మ, విష్ణు, శివ రూపాలలో ఈ సమస్త జగత్తు లో సత్వ రజస్ తమో గుణాలకు కారకులు అవుతున్నారు. ఆ శివుడు సర్వాంతర్యామి. సర్వవ్యాపకుడు. సర్వకారకుడు. అంతటికీ ప్రేరణ ఇచ్చేవారు. మాయని అధీనంలో ఉంచుకుని కూడా నిర్గుణుడు. బలిచక్రవర్తి కుమారులలో శ్రేష్టమైన వాడివి. నీ బల గర్వాన్ని రుద్రుడు తప్పకుండా అణచివేస్తాడు. అనిరుద్ధుడు నీమీదకు వచ్చాడు అంటే, అది శంభుని ప్రేరణగా గుర్తించు. ఆ దేవ దేవుడు నీ గర్వమును పూర్తిగా నాశనము చేస్తారు" అని అశరీరవాణి వినిపించింది.*
*అశరీరవాణి మాటలు విన్న బాణుడు, నాగపాశములో బంధింపబడిన అనిరుద్ధుని చంపే ఆలోచనను వదిలి వేస్తాడు. అప్పుడు, అనిరుద్ధుడు, అమ్మ దుర్గను శరణుకోరి ప్రార్థన చేస్తాడు. "నాగుల విషపు జ్వాలలలో కాలిపోతున్నాను. నీవు, నిన్ను శరణు కోరిన వారికి మంచి కీర్తిని ప్రసాదిస్తావు. నీ కోపము చాలా భయంకరమైనది. త్వరగా వచ్చి నన్ను రక్షించు తల్లీ !" అని. అనిరుద్ధుని ప్రార్థన విన్న దుర్గ తల్లి, కృష్ణ వర్ణములో, జ్యేష్ఠ కృష్ణ చతుర్దశి నాడు ఆతని ఎదుట ప్రత్యక్షమై, నాగ బంధనాలను, తన ముష్టి ఘాతాలతో నుగ్గు చేసి అనిరుద్ధుని విడిపించింది. అదృశ్యం అయిపోయింది. నాగ బంధనాల నుండి విముక్తి పొందిన అనిరుద్ధుడు తన ప్రయురాలు ఉష ఉన్న అంతఃపురం లోకి వెళ్ళాడు.*
*ఇక్కడ ద్వారకలో, శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన నారదమును ద్వారా తన మనుమడు అనిరుద్ధుడు అదృశ్యం అవడం, బాణుడు నాగ బంధనాలతో ఆతనిని బంధించిన విషయం తెలుసుకుంటాడు రమా వల్లభుడు. వెంటనే, తన చతురంగ బలాలు దీసుకుని బాణుని మీదకు దండ యాత్ర కు బయలుదేరాడు. అక్కడ శోణితపురము దగ్గర శంకరుడు తన సేనలతో రక్కణ కల్పిస్తూ కనిపిస్తారు. కృష్ణ పరమాత్మ, శంభుని కింకరులతో, శంభునితోవభీకర పోరు చేస్తాడు. కొంత కాలము తరువాత, కృష్ణుడు పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, "నూవే శాపము ఇచ్చి, మళ్ళీ నీవే కాపాడుతూ, నీవే డ్డుపడుతున్నావు, సదాశివా! ఇది నీకు భావ్యమా!" అని అడుగుతాడు. దానికి, శంకరుడు, "అవును లక్ష్మీ పతీ! నీవు నిజమే చెప్పావు. కానీ, నేను భక్త పరాధీనుడను కదా! నేను చూస్తుండగా నీవు, బాణుని భుజాలను ఎలా ఖండిస్తావు. ఇది జరుహని పని. అందుకని, నీవు నామీద జృంభణాస్త్రము పయోగించు. నేను మూర్ఛ లోకి వెళతాను. అప్పుడు నీకు నేను అప్పచెప్పిన పని పూర్తి చేయగలుగుతావు" అని సెలవిస్తారు, అంబికా పతి.*
*మళ్ళీ యుద్ధ భూమికి వచ్చిన కృష్ణమూర్తి, అనేక విధాలైన శస్త్రాలను ప్రయోగించిన తరువాత పినాకపాణి మీదకు జృంభణాస్త్రము ప్రయోగిస్తాడు. ఆ స్వామి జృభితుడు అయిన తరువాత బాణుని సైన్యాన్ని, బాణుని మీదకు వెళతాడు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు