దేశంలో ఎవరి భాష వారికి చాలా గొప్పగా ఉంటుంది కన్న తల్లిని మాట్లాడే భాషను మర్చిపోవడం ఏ ఒక్కడి తరం కాదు. 56 అక్షరాలతో పరిణతి చెందిన పరిపూర్ణమైన భాష ఆంధ్ర భాషగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర భాషలో ఉన్న విశేషాలు నానార్ధాలు మిగిలిన భాషలలో కొద్దిగా ఉంటాయి. ఒకరోజు ఒక కార్యక్రమానికి వెళ్లిన ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఎదురైంది వక్తలను పిలిచే వ్యక్తి ఆ కార్యక్రమంలో ప్రసంగించవలసినదిగా వెంకటేశ్వర్లు వారిని వేదికను అలంకరించవలసినదిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అనగానే ఆయన వేదిక పైకి వెళ్లి రెండు జేబులు చూసుకొని తర్వాత చొక్కా విప్పి అక్కడ వేసిన కుర్చీలు మేజా బల్ల తుడవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు అదేమిటి అని అడిగితే మీరే కదా నన్ను వేదికను అలంకరించమన్నారు అందుకని ముందు దుమ్ము దులుపుతున్నాను అన్న సమాధానంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు.
అలాగే వేదిక పైకి వచ్చిన పెద్దలు ప్రసంగించే సమయంలో స్వాగతం సుస్వాగతం అంటూ ప్రారంభించడం స్వాగతం ఎవరు చెప్పాలి సుస్వాగతం అంటూ ఎవరు సమాచారం చెప్పాలి అన్న కనీస పరిజ్ఞానం కూడా వారికి ఉండదు మన సాంప్రదాయం ఏమిటి అంటే అంటూ ప్రారంభించే వక్తకు దాని అర్థం తెలుస్తుందా అసలు ఆ పదం ఆంధ్ర భాషలో ఉన్నదా సంప్రదాయము అన్నది మనకు అనూచానంగా వస్తున్న పదం స కు దీర్ఘం ఇస్తే సాంప్రదాయకత అన్న శబ్దం వాడాలన్న విషయం కూడా తెలియకుండా మాట్లాడితే భాష తెలిసినవారు ప్రేక్షకులలో ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడితే తనకు కూడా భాషపై పట్టు ఏర్పడుతుంది మంచి పదాలు వాడడానికి అవకాశం ఉంటుంది. మంచి కళ కల అమ్మాయి కోసం కలగనే యువత అన్న వాక్యంలో కళ అన్న శబ్దాన్ని మూడు అర్థాలలో వాడడం విశేషం కళ అంటే శ్రీ ఐశ్వర్యం అందం కల అంటే ఉన్నటువంటి కలిగిన అని అర్థం వస్తుంది కల అంటే నిద్రపోయే ప్రతి వ్యక్తికి మెదడు చేసే పని కలలు కనడం డ్రీమ్స్ అనే ఆంగ్లంలో చెప్పిన పదానికి ఆంధ్ర భాషలో అర్థం అలాగే నీరు అన్న పదాన్ని తీసుకున్నట్లయితే జలము అని అర్థం వస్తుంది కొంతమంది చాందస్సులు శకటరేపాన్ని వ్రాస్తారు బండి రా అనే అంటాం వారు రాసే నీరు అన్న శబ్దానికి బూడిద అని అర్థం వస్తుంది కనుక మనం మాట్లాడేటప్పుడు కానీ వ్రాసేటప్పుడు కానీ ప్రతి పదాన్ని అర్థం చేసుకొని అర్థవంతంగా వ్రాయగలిగితే కలం కడపాలి తప్ప చొప్పదంటులా పుటలను నింపడం కోసం కాదు అన్న విషయం జ్ఞాపకం పెట్టుకుంటే అపశబ్దాలు మనకు వినపడవు.
;

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి